My blog

Just another WordPress site

Tegimpu Review
Entertainment Movie Review

Tegimpu Review

టాలీవుడ్ లో సంక్రాంతి పోరు హిట్ ఎక్కుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి ఈ సారి సంక్రాంతి పోటీలో ఉంటున్నాయి. వీటికి పోటీగా.. తమిళ స్టార్స్ అజిత్, విజయ్ నటించిన “తెగింపు”, “వారసుడు” వస్తున్నాయి. అందులో అజిత్ నటించిన తెగింపు ఈ రోజు విడుదలైంది. మరి ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలిచిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

వైజాగ్ లోని యూవర్ బ్యాంక్ లో దోపిడి చేయడానికి ఓ గ్యాంగ్ ప్లాన్ చేసి, బ్యాంక్ లోకి వెళ్తారు. అలాగే బ్లాక్ డేవిల్ (అజిత్ కుమార్) కూడా అదే బ్యాంక్ ను కాజేయడానికి అక్కడికి వస్తారు. వీరితో పాటు మూడో గ్యాంగ్ కూడా ఉంటుంది. ఈ మూడో గ్యాంగ్ ఎవరిది ? ఇంటర్నేషనల్ క్రిమినల్ బ్లాక్ డేవిల్ యూవర్ బ్యాంక్ ను ఎందుకు టార్గెట్ చేస్తాడు ? ఆ బ్యాంక్ లోకి 25,000 కోట్లు ఎలా వచ్చాయి ? దానికి ఆ బ్యాంక్ చైర్మెన్ క్రిష్‌ (జాన్ కొక్కెన్) కు సంబంధమేమిటి ? ప్రజలకు వెళ్లాల్సిన 25,000 కోట్లను అజిత్ ఎలా చేర్చాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎక్కువగా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలే చేస్తాడు. అలాంటి యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచే యాక్షన్ సీన్స్ కనిపిస్తాయి. క్లైమాక్స్ లో సముద్రంలో ఉండే ఛేజింగ్ సీన్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. డైరెక్టర్ హెచ్. వినోద్ యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశాడు.

ఈ క్రమంలో కథ, కథనంపై పట్టుతప్పింది. కొన్ని సీన్స్ ఏ మాత్రం లాజిక్ లేకుండా ఉంటాయి. అలాగే సినిమాటిక్ గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ వల్ల కొంత వరకు ఈ మైనస్ లను మర్చిపోయినా, మరి కొన్ని ఇబ్బంది పెట్టిస్తాయి. తెగింపు రోటీన్ స్టోరీ అయినా, యాక్షన్ హంగులు దిద్దడం వల్ల కాస్త కొత్తగా అనిపిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. దీంతో పాటు సినిమాలో డైరెక్టర్ చూపించిన సోషల్ మెసేజ్ బాగుంది. ఫైనాన్షియల్ క్రైమ్ గురించి సినిమాలో అద్భుతంగా చూపించారు. ప్రజలు క్రెడిట్ కార్డ్, మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఎలా నష్టపోతున్నారు అనే అంశాన్ని చూపించిన తీరు బాగుంది.

సముథ్ర ఖని, అజిత్, మంజు వారియర్ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. అయితే వీరి నుంచి మరి కొంత నటనను ఆశించవచ్చు. దాన్నీ తీసుకురావడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. అన్నింటికంటే ముఖ్యంగా గిబ్రన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అయ్యాయి అంటే ఒక కారణం గిబ్రన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ కాస్త మెరుగ్గా చేయాల్సింది.

ప్లాస్ పాయింట్స్ :

అజిత్ కుమార్ నటన, యాక్షన్ సన్నివేశాలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

కొన్ని లాజిక్ లేని సీన్స్
రోటీన్ క్లైమాక్స్
కథ, కథనం

చివరగా.. తెగింపు.. ముగింపు

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *