My blog

Just another WordPress site

Chance for Mrunal Thakur in Suriya 42 movie
Entertainment Gossips

Mrunal Thakur : సూర్య సినిమాలో ఛాన్స్ ?

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతా రామం సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులను సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టోరీ ఒక ప్లస్ అయితే, మరో ప్లస్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ బాలవుడ్ బ్యూటీ నటన, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటన అద్భుతమని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.

కాగా ఈ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మృణాల్ ఆరు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఐదు బాలీవుడ్ సినిమాలు కాగా, ఒకటి నేచులర్ స్టార్ నానితో NANI30. తాజాగా మృణాల్ కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇప్పటి వరకు బాలీవుడ్, టాలీవుడ్ లో కనిపించిన మృణాల్ ఠాకూర్ కు ఈ సారి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా దిశా పటానీ నటిస్తోంది. అయితే ఈ సినిమా స్టోరీ పరంగా ఓ కీలక పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను మేకర్స్ ఎంపిక చేశారని తెలుస్తోంది. మృణాల్ తో ఇప్పటికే స్టోరీ పరమైన చర్చలు కూడా ముగిశాయని టాక్. సూర్య తో సినిమా కావడంతో మృణాల్ ఠాకూర్ ఈ భారీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందని కోలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారం ఉండబోతుందని సమాచారం. ఈ కొత్త షెడ్యల్ లో మృణాల్ ఠాకూర్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *