My blog

Just another WordPress site

Yash in the role of Ravanasura in Ramayanam
Entertainment Gossips

Ramayan : రావణ్ గా.. రాకింగ్ స్టార్ యష్ ?

2018కి ముందు శాండిల్ వుడ్ చిన్న సినిమా పరిశ్రమ. అక్కడ సినిమాలు వస్తాయని కూడా బయట ప్రపంచానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రపంచాన్నే షేక్ చేశాడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కలెక్షన్ల సునామిని సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో కేజీఎఫ్ 2 రెండో స్థానంలో నిలిచింది.

ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ తన తర్వాతి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేడు. ఓ శాండిల్ వుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, యష్ కు తాజాగా ఓ జాక్ పాట్ తగలినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్ర, మధు మంతెన కలిసి రామయాణాన్ని నిర్మించాలని ఎన్నో రోజుల నుంచి ప్లాన్ వేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఈ నిర్మాతలు రూ. 1500 కోట్లు కేటాంచడానికి కూడా రెడీగా ఉన్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ లో రాకింగ్ స్టార్ కు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా రామాయణంలో రాముడి పాత్ర కోసం రణ్ బీర్ కపూర్ ను, రావణసుర పాత్ర కోసం హృతిక్ రోషన్ ను ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం హృతిక్ రోషన్ .. రావణాసుర పాత్రను చేయడానికి సుముఖంగా లేడట. హృతిక్ రోషన్ ఇటీవల విక్రమ్ వేదలో విలన్ పాత్ర చేశాడు.

ఈ స్టార్ విలన్ పాత్ర చేయడం హిందీ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చలేదు. దీంతో మరోసారి విలన్ పాత్ర చేయకూడదని ఫిక్స్ అయ్యాడని టాక్. దీంతో నిర్మాతలు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా రాకింగ్ స్టార్ యష్ ను సంప్రదించారని సమాచారం.

దీనికి బలం చేకూరేలా.. యష్ ఇటీవల తన సోషల్ మీడియాలో.. “నేనో ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. మిమ్మల్ని అలరించేందుకు ఎక్కువగా పనిచేస్తున్నా. అయితే, ఆ వివరాలు ఇప్పుడు చెప్పలేను. ఓపిక పట్టండి” అని సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక ఆ ప్రాజెక్టే “రామాయణ” అని అంతా భావిస్తుండగా.. అది ఎంత వరకు నిజమో అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *