My blog

Just another WordPress site

Alia Bhatt as Mahesh Babu's heroine in SS Rajamouli SSMB29
Entertainment Gossips Movie News

SSMB29 : ఆలియా భట్ ను ఫిక్స్ చేసిన జక్కన్న?

ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉంది. ఆర్ఆర్ఆర్ లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజ్ కూడా ప్రంపచ ప్రేక్షకులు వరకు వెళ్లింది. అంతే కాదు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో జక్కన్న డైరెక్షన్ లో హీరోగా చేయాలని ప్రతి ఒక హీరో కోరుకుంటున్నాడు. కాగా రాజమౌళి నుంచి తర్వాత రాబోయే చిత్రం SSMB29.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించే మొదటి చిత్రం ఇది. దీనికి రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ ఉంటుందని
అలాగే ప్రపంచ స్థాయి అడ్వెంచర్ ఈ చిత్రం ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. అలాగే ఈ భారీ చిత్రాన్ని ఫ్రాంచైజీ గా రాజమౌళి రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఎవరు నటిస్తారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. ముందుగా ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. ఆలియా ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో నటించిన విషయం తెలిసిందే.

అయితే SSMB29 స్టోరీని విజయేంద్ర ప్రసాద్ ఇంకా పూర్తి చేయలేదు. కానీ, ఇప్పటి నుంచి ఈ సినిమాలో పాత్రలు కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే రాజమౌళి స్పందిచాల్సిందే.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *