My blog

Just another WordPress site

KL Rahul - Athiya Shetty: Rahul-Athiya's marriage was grand
Cricket Movie News

KL Rahul – Athiya shetty : ఘనంగా రాహుల్-అతియా వివాహం

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభంలో వీరి రీలేషన్ షిప్ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. వాటిని ఈ ప్రేమ జంట కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. వీరి పెళ్లికి కేఎల్ రాహుల్ పేరెంట్స్ తో పాటు అతియా శెట్టి తండ్రి సీనియర్ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కూడా అంగీకరించారు. దీంతో సోమవారం ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.

మహారాష్ట్రలోని ఖండాలాలో అతియ తండ్రి నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, పలువరు సన్నిహితుల సమక్షంలో ప్రేమ జంట రాహుల్, ఆతియా ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం ఈ జంట మీడియా ప్రతినిధులకు ఫోటోలకు ఫోజులిచ్చింది.

అలాగే తమ పెళ్లి ఫోటోలను కేఎల్ రాహుల్ తన సోషల్ మీడియాలో అకౌంట్స్ లో షేర్ చేశాడు. “అతియ వెలుగులో నేను ప్రేమించడం నేర్చుకున్నా. ఈరోజు అత్యంత ఇష్టమైన వ్యక్తుల మధ్య మా ఇంట్లో మేము పెళ్లి జరగడం చాలా ఆనందంగా ఉంది.” అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. కాగా రాహుల్-అతియా పెళ్లికి దాదాపు 3000కి పైగా అతిథులు వచ్చారని సమాచారం.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *