My blog

Just another WordPress site

Once again up the screen is Manchu Manoj, Bhuma Maunika
Andhra Pradesh Movie News

Machu Manoj : మరోసారి తెరకి పైకి మంచు మనోజ్, భూమా మౌనిక

మంచు ఇంటి వారసుడు ప్రముఖ నటుడు మంచు మనోజ్ గురించి తెలియని వారుండరు. మనోజ్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా ఎదో ఒక అంశంతో ఎక్కువ సార్లు వార్తలకు నిలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన డైవర్స్ గురించి వార్తలు వచ్చాయి. మనోజ్.. ప్రణతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లైన రెండేళ్లకే ప్రణతి నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఆ విడాకుల గురించి సోషల్ మీడియాలో, న్యూస్ లో చర్చ కాస్త ఎక్కువగానే జరిగింది.

దీని తర్వాత మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్త గత కొన్ని రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది. గత ఏడాది వినాయక చవితి సమయంలో మనోజ్, మౌనిక కలిసి పూజలు నిర్వహించారు. అప్పుడు త్వరలోనే ఓ శుభవార్త చెబుతా అని మనోజ్ అంటాడు. అప్పటి నుంచి ఈ వార్తలు వస్తున్నాయి.

దీని తర్వాత వీరి ప్రేమ వ్యవహారం గురించా చాలా వార్తలు వచ్చాయి. కానీ, వీరు ఎక్కుడా కనిపించలేదు. కానీ, తాజాగా మంచు మనోజ్ పోస్ట్ చేసిన ట్వీట్ తో మరోసారి ఈ న్యూస్ తెరపైకి వచ్చింది. మౌనిక రెడ్డి తండ్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి జన్మదినం కావడంతో, మనోజ్ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు.

‘ఆయన ఒక గొప్ప లీడర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తి. ఆయనే భూమా నాగిరెడ్డి గారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన అశీసులు మాత్రం ఎప్పుడు మనపైనే ఉంటాయి’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మంచు మనోజ్ భూమా ఫ్యామిలీ దగ్గరవుతున్నాడని, త్వరలోనే వీళ్లు పెళ్లి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *