My blog

Just another WordPress site

pathan box office collection worldwide
Entertainment Movie News

Pathaan : బాక్సాఫీస్ వద్ద పఠాన్ విధ్వంసం.. మూడు రోజుల్లో 300 కోట్లు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. వరుస ఫ్లాప్ లు అందుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు. భారీ అంచానలతో వచ్చిన జీరో.. ఆయన కెరీర్ నే జీరో చేసింది. దీంతో నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా పఠాన్ తో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ అనే సినిమాతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనిలో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె హీరోయిన్.

పఠాన్ విడుదల ముందు అనేక విమర్శలను ఎదుర్కొంది. బైకాట్ నినాదాన్ని కూడా ఎదుర్కొంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 300 కోట్లను కొల్లగొట్టింది.

తొలి రోజే 100 కోట్ల మార్క్ ను అందుకుని, బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు. పఠాన్ కు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఓపెనింగ్ కలెక్షన్లు ఏకంగా 106 కోట్లు వచ్చాయి. రెండో రోజు ఇంకాస్త మెరుగ్గా.. 113.50 కోట్లను సంపాదించింది. తాజాగా మూడో రోజు 93.50 కోట్లను వసూళ్లు చేసి, బాలీవుడ్ ఏ సినిమా క్రియేట్ చేయలేని రికార్డును క్రియేట్ చేసింది.

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 300 కోట్ల కలెక్షన్లు చేసిన మూవీ పఠాన్ నిలిచింది. ఇంకా వీకెండ్ పూర్తి కాకపోవడంతో, ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం లేక పోలేదు

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *