My blog

Just another WordPress site

Unstoppable with NBK Pawan Kalyan episode release date
Entertainment Movie News

PSPK with NBK : అన్ స్టాపబుల్ ఇంకెప్పుడు సామి..

పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబుతి పునకాలే. ఆయనకు ఉన్న క్రేజ్ వేరు.. ఆ పేరుకు ఉన్న ఇమేజ్ వేరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తన కంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు. లీక్ అయి అందరూ చూసిన సినిమాకు కూడా కోట్ల రూపాయల కలెక్షన్లు తెప్పించుకున్న కథనాయకుడు పవన్ కళ్యాణ్. ఇలాంటి హీరోను ఎవరైనా ఇష్టపడకుండ ఉంటారా ? అందుకే కాబోలు ఈ పవర్ స్టార్ కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు.

ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందే కానీ, ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇటీవల నందమూరి బలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షోకు గెస్ట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షో షూటింగ్ కోసం వెళ్లినప్పుడే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ హవా నడించింది.

ఇక ఫుల్ ఎపిసోడ్ వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. అందుకే ఇటు మెగా ఫ్యాన్స్ , అటు నందమూరి ఫ్యాన్స్ ఈ ఫుల్ ఎపిసోడ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ టాక్ షోలో పవన్ కళ్యాణ్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేశాడు? దానికి పవన్ ఎలాంటి సమాధానలు చెప్పాడు ? అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఫుల్ ఎపిసోడ్ ను ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫాం సంక్రాంతి సందర్బంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. కానీ మెగా, పవర్ స్టార్, నందమూరి ఫ్యాన్స్ ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ను ముందుగానే స్ట్రిమింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆహా వారు.. పవర్ ఎపిసోడ్ ను సంక్రాంతికే తీసుకువస్తారా ? లేదా ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ముందే తీసుకువస్తారా ? అనేది వేచి చూడాలి.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *