My blog

Just another WordPress site

Pawan Kalyan to Kondagattu today Varahi vehicle
Politics Telangana

Pawan Kalyan : నేడు కొండగట్టులో ‘వారాహి’కి పూజలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. పూజా అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో జనసేన పార్టీ తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు.

ఈ సమావేశం పూర్తి అయిన తర్వాత ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధర్మపురి నుండే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ దశలవారీగా సందర్శిస్తారు. కాగా ధర్మపురిలో నరసింహస్వామి దర్శన అనంతరం పవన్ సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ కు వస్తారు.

పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు, ధర్మపురి పర్యటన పూర్తి వివరాలు..

ఉదయం హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయల్దేరనున్నారు పవన్‌. ఉదయం 11 గంటలకి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు చేరుకోనున్న పవన్‌.. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథానికి పూజలు చేయిస్తారు.

మధ్యాహ్నం 1 గంటకు కోడీమ్యాల మండలంలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *